: ఒడిశాలో 15 అడుగుల కింగ్ కోబ్రా పట్టివేత


చాలా అరుదుగా కనిపించే 15 అడుగుల భారీ కింగ్ కోబ్రాను ఒడిశాలోని ఒక ఇంట్లో గుర్తించారు. సిమిలిపల్ పులుల సంరక్షణ కేంద్ర పరిధిలోని మయూర్ భంజ్ జిల్లాలో ఉన్న బరిపడాలో ఈ కింగ్ కోబ్రా కనిపించింది. దీనిని పట్టుకునేందుకుగాను నిష్ణాతులైన పాములు పట్టేవాళ్లను అధికారులు పిలిపించారు. ఇటువంటి కింగ్ కోబ్రాలను ఐదింటిని పట్టిన కృష్ణ చంద్ర గోచ్యత్ అనే పాములు పట్టే వ్యక్తి ఈ కింగ్ కోబ్రాను పట్టుకుని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టాడు. ఈ అరుదైన సర్పాన్ని చూసేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ, ఇప్పటివరకు తాను చాలా పాములు పట్టానని, అయితే, ఈ తరహా పాములను మాత్రం కేవలం ఐదింటినే పట్టానని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News