: మహిళా ఉద్యోగులకు హాస్టల్ వసతి... ఐఏఎస్ లకు రెయిన్ ట్రీ అపార్టుమెంట్లు
అమరావతికి ఉద్యోగుల తరలింపు అంశంపై ఏపీ ప్రధాన కార్యదర్శి టక్కర్ ఈరోజు కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల తరలింపు వివరాలను ఆయా శాఖల కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 24 నుంచి పైలెట్ షిఫ్టింగ్ లు మొదలుపెట్టాలని, మహిళా ఉద్యోగులకు హాస్టల్ వసతి కల్పించాలని, ఐఏఎస్ అధికారులకు రెయిన్ ట్రీ అపార్ట్ మెంట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.