: సైఫ్ అలీ ఖాన్ కుమార్తెకు నిశ్చితార్థమైందా?


బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, అతని మొదటి భార్య అమృతా సింగ్ దంపతుల కుమార్తె సారా అలీఖాన్ కు నిశ్చితార్ధమైందా? అని బాలీవుడ్ లో ఆసక్తికర చర్చనడుస్తోంది. సైఫ్ కుమార్తె సారా బాలీవుడ్ లో అరంగేట్రం చేయనుందంటూ గత కొంత కాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సైఫ్ అలీ ఖాన్ రెండవ భార్య కరీనా కపూర్ ఖాన్, సారాను వెండితెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే మరాఠాలో సంచలన విజయం సాధించిన 'సైరాట్' స్క్రీనింగ్ కు సారా అలీఖాన్ తండ్రితో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా చేతివేలికి ఎంగేజ్ మెంట్ రింగ్ తో ఆమె మీడియా కంటబడింది. గత చాలా కాలంగా సారా అలీఖాన్ కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియా ప్రేమలో ఉందంటూ వార్తలు, ఫోటోలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో వారిద్దరికీ ఎంగేజ్ మెంట్ జరిగిందా? అని బాలీవుడ్ అనుమానం వ్యక్తం చేస్తోంది.

  • Loading...

More Telugu News