: టాస్ గెలిచి, బ్యాటింగ్ తీసుకుని పెవీలియన్ కు క్యూ కట్టిన జింబాబ్వే ఆటగాళ్లు!
హరారేలో భారత్, జింబాబ్వే జట్ల మధ్య జరుగుతున్న రెండవ టీ-20లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న జింబాబ్వే జట్టు పరుగులు రాబట్టడంలో విఫలమై, వరుసగా వికెట్లను చేజార్చుకుంటోంది. ఆట ఐదో ఓవర్ పూర్తయ్యేసరికి నాలుగు టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోగా, ఈ వికెట్లన్నీ తొలి టీ-20 ఆడుతున్న బరీందర్ సింగ్ శరణ్ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఓపెనర్ చిబాబా 10, మసకజ్జా 10, సికందర్ రజా 1 పరుగుకు అవుట్ కాగా, ముతొంబోడ్జి డక్కౌటయ్యాడు. ప్రస్తుతం జింబాబ్వే స్కోరు 5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 28 పరుగులు.