: కేసీఆర్ సీఎం అయ్యాక నాగార్జున సాగర్ ఎండిపోయింది!: ఉత్తమ్ కుమార్ రెడ్డి


కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాగార్జున సాగర్ ఎండిపోయిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా కోదాడలో ఈరోజు ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మిషన్ కాకతీయ అని చెప్పి చెరువులను కూడా ఎండబెట్టారంటూ తెలంగాణ సర్కార్ పై మండిపడ్డారు. ఉన్న ఇందిరమ్మ ఇళ్లకే గతిలేదు... డబుల్ బెడ్ రూం పథకం అంటున్నారన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కేసీఆర్ రెండేళ్ల పాలనలో మేలు జరిగింది కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

  • Loading...

More Telugu News