: రాజన్ ను పంపేశా... ఇక నెక్ట్స్ టార్గెట్ కేజ్రీవాల్: సుబ్రహ్మణ్య స్వామి
తాను ఇప్పటివరకూ రఘురాం రాజన్ వెంటపడి, ఆయనకు రెండోసారి ఆర్బీఐ గవర్నర్ పదవిని దక్కకుండా చేశానని, ఇప్పుడిక ఆయన వెళ్లిపోయాడు కాబట్టి, తన తదుపరి లక్ష్యం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తున్న బీజేపీ నాయకుడు మహేష్ గిరికి మద్దతిచ్చేందుకు వచ్చిన స్వామి మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ ఇప్పటివరకూ మోసం చేస్తూనే జీవితాన్ని నెట్టుకొచ్చారని ఆరోపించారు. ఆయన ఐఐటీ విద్యాభ్యాసం, అడ్మిషన్ ఎలా వచ్చిందన్న వివరాలను త్వరలో మీడియాకు చెబుతానని, ఆయన అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలూ తన వద్ద ఉన్నాయని అన్నారు. కేజ్రీవాల్ సంగతి చూసేవరకూ నిద్రపోయేది లేదని శపధం చేశారు.