: ఇండియాకు రెండో బులెట్ రైలు... ఢిల్లీ నుంచి వారణాసికి 2.40 గంటల్లో ప్రయాణం!


ఇండియాకు తొలి బులెట్ రైలు ముంబై, అహ్మదాబాద్ మధ్య ఖరారు కాగా, రెండో బులెట్ రైలు రూట్ ఢిల్లీ, వారణాసి మధ్య రానున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో పాటు, దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా వారణాసి ఉండటం కూడా ఈ రైలు సౌకర్యాన్ని దగ్గర చేయనుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ నుంచి అలీగఢ్, ఆగ్రా, కాన్పూర్, లక్నో, సుల్తాన్ పూర్ మీదుగా వారణాసి చేరుకునే రైలు కేవలం 2 గంటలా 40 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుందని సమాచారం. ఢిల్లీ నుంచి లక్నో మధ్య 506 కిలోమీటర్ల దూరాన్ని గంటా 45 నిమిషాల్లోనే చేరుకునేంత వేగంతో ఇది నడుస్తుందని, బులెట్ రైలు మార్గం నిర్మాణం కోసం రూ. 43 వేల కోట్లు వ్యయం అవుతుందన్న అంచనాలు ఉండగా, ఓ స్పెయిన్ సంస్థ సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఇప్పటికే మధ్యంతర నివేదికను ఇచ్చిందని, ఈ ఏడాది చివరకు తుది నివేదిక మోదీ సర్కారు చేతికి అందుతుందని తెలుస్తోంది. వచ్చే సంవత్సరం యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, వాటిల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న వేళ, యూపీ ప్రజలకు బులెట్ రైలు వరాన్ని ఎన్నికల లోపే మోదీ ప్రకటించవచ్చని సమాచారం.

  • Loading...

More Telugu News