: రోడ్డు ప్రమాదంలో హాలీవుడ్ నటుడు, 'స్టార్ ట్రెక్' ఫేం ఆంటోన్ యల్ చిన్ దుర్మరణం


హాలీవుడ్ యువనటుడు, స్టార్ ట్రెక్ సిరీస్ లో చికోవ్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా పేరును సంపాదించుకున్న యువనటుడు ఆంటోన్ యల్ చిన్ (27) ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. స్నేహితులను కలిసే నిమిత్తం వెళుతున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు తొలుత మెయిల్ బాక్స్ పిల్లర్ ను, ఆపై సెక్యూరిటీ ఫెన్స్ ను ఢీకొని పల్టీలు కొట్టిందని లాస్ ఏంజిల్స్ పోలీస్ ఆఫీసర్ జెన్నీ హోసిర్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారని తెలిపారు. కాగా, తన చిన్నతనం నుంచి నటిస్తున్న యల్ చిన్, 'ఈఆర్', 'ది ప్రాక్టీస్', 'కర్బ్ యువర్ ఇంతూజియాజమ్' వంటి టీవీ సిరీస్ లతో పేరు తెచ్చుకుని 2001లో ఆంటోనీ హాప్ కిన్స్ నిర్మించిన 'హార్ట్స్ ఇన్ అట్లాంటిస్' చిత్రంతో పెద్ద తెరపైకి వచ్చాడు. ఆపై క్రైమ్ థ్రిల్లర్ 'ఆల్ఫా డాగ్', టీనేజ్ కామెడీ చిత్రం 'చార్లీ బార్ట్ లెట్' వంటి చిత్రాల్లోనూ, 2009లో వచ్చిన 'టెర్నినేటర్ సాల్వేషన్'లోనూ నటించాడు. ఆయన మరణం పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు.

  • Loading...

More Telugu News