: క్లచ్ ఉండదు... బటన్ నొక్కితే గేర్లు మారేలా టీవీఎస్ కొత్త బైక్!


తాము తయారు చేసి పేటెంట్ పొందిన విప్లవాత్మక ఎస్ఎంటీ (సెమీ ఆటోమేటెడ్ టెక్నాలజీ)తో కూడిన సరికొత్త బైక్ లను టీవీఎస్ విడుదల చేయనుంది. 2009లో కనుగొన్న ఎస్ఎంటీ విధానానికి ఏడేళ్ల అనంతరం ఈ సంవత్సరమే పేటెంట్ లభించగా, దీని వాడకం ద్వారా గేర్లు మార్చాల్సిన అవసరం తప్పుతుంది. ఇందులో క్లచ్ ఉండదు కాబట్టి రెండు నుంచి 5 శాతం వరకూ ఇంధనం ఆదా అవుతుందని సంస్థ చెబుతోంది. హ్యాండిల్ బార్ ఉండే స్విచ్ ని నొక్కడం ద్వారా ఎలక్ట్రోమెకానిక్ విధానం యాక్టివేట్ అయి, గేర్లు వాటంతట అవే మారిపోతాయని సంస్థ ప్రకటించింది. గేెర్లను పైకి మార్చుకునేందుకు ఓ బటన్, వాటిని కిందకు తెచ్చేందుకు మరో బటన్ ఉంటుందని పేర్కొంది. అతి త్వరలో ఈ విధానంలో తయారయ్యే బైక్ లను భారత మార్కెట్లోకి తెస్తామని చెప్పింది. కాగా, టీవీఎస్ అపాచీ వేరియంట్ లో ఈ ఎస్ఎంటీ విధానాన్ని పరిచయం చేస్తారని తెలుస్తోంది. భవిష్యత్తులో త్రిచక్ర వాహనాలకూ ఎస్ఎంటీని వాడే ఆలోచనలో ఉన్నట్టు సంస్థ వెల్లడించింది.

  • Loading...

More Telugu News