: బెజవాడలో కుండపోత!... లోతట్టు ప్రాంతాలు జలమయం!
నైరుతి రుతు పవనాలు ఎంట్రీ ఇవ్వడంతోనే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు తెర లేచింది. రుతు పవనాల ఎంట్రీతో నిన్నటి నుంచే వాతావరణం మొత్తం చల్లబడగా, నిన్న రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో వర్షాలు కురిశాయి. నేడు, రేపు రెండు రాష్ట్రాలవ్యాప్తంగా భారీ వర్షాలు తప్పవన్న వాతావరణ శాఖ హెచ్చరికలు వెలువడిన మరుక్షణమే ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడలో కుండపోత మొదలైంది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. నగరంలోని డ్రైనేజీలన్నీ వర్షపు నీటితో పొంగిపొరలుతున్నాయి. వెరసి నగరంలో జనజీవనం స్తంభించింది.