: రాజన్ తొలి ఎఫెక్ట్... 67 పైసలు జారిన రూపాయి!
తాను రెండోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరుగా బాధ్యతలు చేపట్టలేనని రఘురాం రాజన్ చేసిన ప్రకటన, నిపుణులు ఊహించినట్టుగానే ఫారెక్స్ మార్కెట్ పై పడింది. బ్యాంకులు, విదేశీ ఇన్వెస్టర్లు రూపాయి అమ్మకానికి భారీగా ప్రయత్నించడంతో డాలర్ తో మారకపు విలువ ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 50 పైసలకు పైగానే దిగజారింది. దీని ప్రభావం బులియన్ మార్కెట్ పైనా ఉండే అవకాశాలు పుష్కలం కావడంతో బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు భారీగా పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఉదయం ఫారెక్స్ సెషన్లో డాలర్ తో మారకపు విలువ 67.63 వద్ద ప్రారంభమై ఆ వెంటనే 67.74కు దిగజారింది. ఆపై కొంత కొనుగోలు మద్దతు కనిపించడంతో ప్రస్తుతం 67.56 వద్ద కొనసాగుతోంది. రాజన్ ప్రకటనతో రూపాయి విలువ 10 నుంచి 15 పైసల వరకూ పతనమవుతుందని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.