: భారీ యంత్ర సామగ్రి లోడుతో 320 చక్రాల లారీ... అనకాపల్లి దాటింది
సాధారణంగా లారీ అంటే ఆరు చక్రాలు, మల్టీ యాక్సిల్ అయితే, 10, ఆపై భారీ వాహనమైతే 14, 18 చక్రాలున్న లారీలను అందరమూ చూశాము. కానీ, 320 చక్రాలున్న లారీని మీరెప్పుడైనా చూశారా? ప్రస్తుతం ఈ లారీ, ఓ భారీ యంత్ర సామగ్రిని మోసుకుంటూ జాతీయ రహదారిపై కోల్ కతా నుంచి చెన్నై దిశగా ప్రయాణిస్తూ, విశాఖ జిల్లాను దాటింది. నాలుగు వాహనాల్లో రక్షణ సిబ్బంది ముందూ వెనుకా నెమ్మదిగా కదులుతుండగా, మరో 50 మంది లారీకి ఇరు పక్కలా వెళుతుంటే భారీ మదగజంలా ఈ లారీ, మరో ట్రాలీ సాయంతో కదులుతుంటే ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ అతిపెద్ద లారీ ప్రయాణ మార్గంలో ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం అవుతోందని తెలుస్తోంది. అప్పుడప్పుడూ లారీని పక్కకు నిలిపి వెనకున్న వాహనాలకు దారినిస్తూ సాగుతోంది. ప్రస్తుతం అనకాపల్లి దాటిన ఈ లారీ, మరో నాలుగైదు రోజులు ప్రయాణిస్తేనే చెన్నైకి చేరుతుందని సమాచారం.