: నేను తండ్రిని అయ్యాకే... మా నాన్న త్యాగాలు తెలిశాయి!: ‘ఫాదర్స్ డే’ గ్రీటింగ్స్ లో కేటీఆర్
‘ఫాదర్స్ డే’ సందర్భంగా నిన్న తెలుగు నేలలో రాజకీయ వారసులుగా తెరంగేట్రం చేసిన ముగ్గురు కీలక నేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కల్వకుంట్ల తారకరామారావు, నారా లోకేశ్ తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ లో ప్రత్యేకంగా పోస్ట్ లు పెట్టారు. ఈ ముగ్గురు నేతలు తమ తండ్రులతో ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీటిలో కేటీఆర్ ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. తాను తండ్రి అయ్యాక గాని తన తండ్రి తమకోసం చేసిన త్యాగాలు తెలిసిరాలేదని ఆయన పేర్కొన్నారు. ‘‘మా నాన్న నా కోసం చేసిన త్యాగాలు నేను నాన్న అయ్యాక తెలిసివచ్చాయి’’ అంటూ ఆయన ట్వీటారు. ఇక ఈ ట్వీట్ కు ఆయన ఓ రెండు రేర్ ఫొటోలను కూడా యాడ్ చేశారు. టోపీ, కళ్లద్దాలు పెట్టుకున్న తన కొడుకు, కూతురుతో కలిసి టోపీ మాత్రమే పెట్టుకున్న తన తండ్రి ఫొటోను పోస్ట్ చేసిన కేటీఆర్... తనను తన తండ్రి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న మరో ఫొటోను కూడా ఆయన దానికి జత చేశారు.