: కాబూల్ లో ‘ఉగ్ర’ పంజా!... ఉద్యోగుల బస్సులో పేలిన బాంబు, పలువురు దుర్మరణం


ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో నేటి ఉదయం ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. తమ ఇళ్ల నుంచి కార్యాలయాలకు వెళ్లేందుకు ఆ దేశ ఉద్యోగులు బయలుదేరిన మినీ బస్సులో ఉగ్రవాదులు బాంబును పేల్చారు. ఈ ఘటనలో బస్సు తునాతునకలు కాగా బస్సులోని చాలా మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో చనిపోయిన వారు ఎందరన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు. పేలుడుతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News