: లంబూ కూడా పెళ్లి కొడుకు అవుతున్నాడు!... ప్రతిమతో ముగిసిన ఇషాంత్ నిశ్చితార్థం
టీమిండియాలో మరో కీలక ఆటగాడు పెళ్లి చేసుకోబోతున్నాడు. జట్టు బౌలింగ్ లో కీలక భూమిక పోషిస్తున్న ఇషాంత్ శర్మ నిన్న ప్రతిమా సింగ్ అనే యువతితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. జట్టులో అంతా లంబూ అని పిలుచుకునే ఈ ఫాస్ట్ బౌలర్ కు ప్రస్తుతం జరుగుతున్న జింబాబ్వే పర్యటన నుంచి విశ్రాంతి లభించింది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్- 9 సీజన్ లో రైజింగ్ పుణే సూప్ జెయింట్స్ కు ప్రాతినిధ్యం వహించిన ఇషాంత్ నిన్న న్యూఢిల్లీలో జరిగిన వేడుకలో తాను ప్రేమించిన ప్రతిమ వేలికి రింగు తొడిగాడు. త్వరలోనే వీరి పెళ్లిని ఘనంగా నిర్వహించనున్నట్లు సమాచారం. ఎంగేజ్ మెంట్ చేసుకున్న లంబూకు జట్టు సభ్యుడు సురైశ్ రైనా ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపాడు.