: ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి చైనా ఓకే!... ఎన్నిక విధానంపైనే మాట్లాడుతోంది: సుష్మా స్వరాజ్


అణు సరఫరాదార్ల బృందం (ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి దాదాపుగా రంగం సిద్ధమైంది. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా సహా రష్యా తదితర దేశాలన్నీ భారత సభ్యత్వానికి తమ సంపూర్ణ మద్దతు తెలిపాయి. అయితే చైనా ఒక్కటే భారత సభ్యత్వానికి వ్యరేతికంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలన్నీ అవాస్తవమంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నిన్న ప్రకటించారు. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి చైనాకు ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పిన సుష్మా... భారత్ సభ్యత్వానికి జరగాల్సిన ఎంపిక విధానంపైనే ఆ దేశం మాట్లాడుతోందని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై చర్చించేందుకు భారత్ విదేశాంగ కార్యదర్శి జైశంకర్ ఇటీవలే గుట్టుచప్పుడు కాకుండా చైనా వెళ్లి వచ్చిన సంగతి తెలిసింది.

  • Loading...

More Telugu News