: హై ఫైవ్ నాన్న... లాట్స్ ఆఫ్ లవ్ : అల్లు అర్జును కుమారుడు అయాన్


ఫాదర్స్ డే సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అయాన్ తన తండ్రికి ఒక అరుదైన కానుక ఇచ్చాడు. ఒక తెల్లటి కాగితం పైన ‘హై ఫైవ్ నాన్న’ అని, మధ్యలో బ్లూ రంగులో ఉన్న చేతిగుర్తు, దాని కింద ‘యు ఆర్ ఆసమ్!’ అని, మరో పేపర్ పై హ్యాపీ ఫాదర్స్ డే, లాట్స్ ఆఫ్ లవ్, అయాన్’ అని రాసి తన తండ్రికి కానుకగా ఇచ్చాడు. ఈ పేపర్లను అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. హ్యాపీ ఫాదర్స్ డే అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. తన కుమారుడి నుంచి స్వీట్ సర్ ప్రైజ్ అంటూ పేర్కొన్నాడు. దీంతో పాటు, ఒక ఫొటోను కూడా పోస్ట్ చేశాడు.

  • Loading...

More Telugu News