: బంగారు తాపడంతో మైసూర్ యువరాజు వివాహ ఆహ్వాన పత్రికలు


మైసూర్ యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ్ ఒడయార్ వివాహ ఆహ్వాన పత్రికలు తయారయ్యాయి. కృష్ణదత్త వివాహం త్రిషికా కుమారితో జరగనుండగా, పెళ్లి పత్రికలను పంచే కార్యక్రమం ప్రారంభమైంది. బంగారు తాపడంతో, మైసూరు రాజవంశీకుల సంప్రదాయం ప్రకారం గండభేరుండం, ప్యాలెస్ చిహ్నలతో కూడిన ఆహ్వాన పత్రికలను సిద్ధం చేశారు. మొత్తం ఐదు రకాల ఆహ్వాన పత్రికలు సిద్ధం కాగా, అతిథుల హోదాను అనుసరించి వాటిని పంపిణీ చేయనున్నారు. బంగారంతో లేపనం చేసిన పత్రికను ప్రధాని నరేంద్ర మోదీకి త్రిషికా తండ్రి హర్షవర్థన్ అందించి, పెళ్లికి రావాలని ఆహ్వానించారు. పలువురు కేంద్ర మంత్రులకు, కర్ణాటక, రాజస్థాన్ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, వసుంధరా రాజేలకు, మాజీ ప్రధాని దేవెగౌడకు, రాజకీయ, సినీ, క్రీడారంగ ప్రముఖులకు పంచినట్టు రాజ కుటుంబీకులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News