: బ్రిటన్ లో భారత హై కమిషనర్ తో కలిసి కనిపించిన విజయ్ మాల్యా


బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా లండన్ లో ఉన్నట్టు తొలిసారిగా సాక్ష్యాలు చిక్కాయి. బ్రిటన్ లో భారత హై కమిషనర్ నవ్ తేజ్ సర్నా పాల్గొన్న ఓ కార్యక్రమంలో మాల్యా కూడా కనిపించారు. సుశీల్ సేథ్ రచించిన 'మంత్రాస్ ఫర్ సక్సెస్: ఇండియాస్ గ్రేటెస్ట్ సీఈఓస్; టెల్ యూ హౌ టూ విన్' అనే పుస్తకావిష్కరణ జరుగగా, మాల్యా అందులో పాల్గొన్నారు. ఈ దృశ్యాలను వీడియో చానళ్లు పదేపదే ప్రసారం చేశాయి. భారత ఏజన్సీలు గాలిస్తున్న వ్యక్తితో కలిసి హై కమిషనర్ పాల్గొనడంపై పలువురు విమర్శలు గుప్పించారు. అయితే, మాల్యాను తాము ఆహ్వానించలేదని సర్నా వ్యాఖ్యానించారు. గెస్టుల్లో ఆయన కనిపించగానే, సర్నా బయటకు వచ్చేశారని విదేశాంగ శాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News