: భారత్‌లో ఐఎస్ కార్యకలాపాలపై రిక్రూటర్లను ప్రశ్నిస్తున్న ఎన్ఐఏ


భారత్‌లో ఐఎస్ఐఎస్ యూనిట్‌కు సెకండ్ ఇన్ కమాండ్‌గా వ్యవహరిస్తున్న జునూద్ అల్ ఖలిఫా అల్ హింద్, రిజ్వాన్ అహ్మద్ అలియాస్ ఖాలిద్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రశ్నిస్తోంది. భారత్‌లో వారి కార్యకాలపాలపై ఆరా తీస్తోంది. వీరు గతంలో ఇరాక్, సిరియాలో పర్యటించిన నేపథ్యంలో ఆ వివరాలనూ రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్‌కు చెందిన రిజ్వాన్(19) గతేడాది ఐఎస్‌లో చేరాడు. ఇండియాలో ఐఎస్ విభాగం సహ వ్యవస్థాపకుడైన షపీ అర్మార్‌తో రిజ్వాన్‌కు నేరుగా సంబంధాలున్నాయి. భారత్‌లో జిహాద్ అమలు కోసం పనిచేస్తున్న ఐఎస్‌కు చెందిన ముద్దాబిర్ షేక్, నఫీస్ ఖాన్, జరార్‌లను రిజ్వాన్ కలిశాడు. భారత్‌లో ఐఎస్ విభాగానికి హెడ్‌గా వ్యవహరిస్తున్న ముద్దాబిర్ షేక్‌ను ఈ ఏడాది మొదట్లో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దేశంలోని మిగతా ఐఎస్ ఉగ్రవాదులను కలిసిన రిజ్వాన్ భారత్‌లో దానిని మరింత విస్తృతం చేయాలని, బలంగా తయారు చేయాలని భావించినట్టు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. లక్నోలో నిర్వహించిన పలు ఐఎస్ సమావేశాలకు హాజరైన రిజ్వాన్‌ను మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే గత డిసెంబరు నుంచి కనిపించకుండా పోయి తర్వాత పోలీసులకు చిక్కిన మోహ్‌సిన్ షేక్‌ను కూడా ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News