: రాజన్ కు విషయం అర్థమైంది... మంచిది: సుబ్రహ్మణ్య స్వామి
తనకు రెండోసారి ఆర్బీఐ గవర్నర్ పదవి దక్కదని తెలుసుకున్న తరువాతనే రఘురాం రాజన్, తాను పదవిని స్వీకరించబోనని చెప్పాడని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించారు. రాజన్ కు విషయం అర్థమైందన్న ఆయన, రాజన్ వద్దని తాను చెప్పిన కారణాలే సరైనవని రుజువైందని అన్నారు. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ను పాప్యులారిటీ ఆధారంగా ఎంపిక చేయరని అన్నారు. స్వయంగా ఆయనే ప్రకటన చేసి మంచి పని చేశారని అన్నారు. కాగా, రాజన్ ను రెండోసారి కొనసాగించవద్దని స్వామి పలు మార్లు మోదీ, జైట్లీలకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఆయన ఇండియన్ కాదని, భారత రహస్య సమాచారాన్ని బయటి దేశాలకు పంపుతున్నారని సంచలన విమర్శలు చేశారు.