: ఆర్బీఐ కొత్త గవర్నర్ నియామకంపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం!: అరుణ్ జైట్లీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా రెండోసారి బాధ్యతలు స్వీకరించేందుకు రఘురాం రాజన్ విముఖంగా ఉన్నట్టు, మళ్లీ అధ్యాపక వృత్తి చేపట్టేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్టు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ దీనిపై స్పందించారు. ఆర్బీఐ కొత్త గవర్నర్ నియామకంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆర్బీఐ గవర్నర్ గా రఘురాం రాజన్ పనితీరు అద్భుతమని కొనియాడారు. అయితే రఘురామ్ రాజన్ నిర్ణయాన్ని గౌరవిస్తామని ఆయన తెలిపారు. దీంతో రఘురాం రాజన్ తన పదవికి రాజీనామా చేయనున్నారనే వాదనకు బలం చేకూరింది. ఇదే జరిగితే సుబ్రహ్మణ్యస్వామి ఒత్తిడి ఫలించినట్టే భావించవచ్చు. కాగా, రాజన్ పదవీ కాలం సెప్టెంబర్ 4తో ముగియనున్న సంగతి తెలిసిందే.