: నాలుగు కోట్లతో తీసిన సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగులు?
తక్కువ బడ్జెట్టుతో తెరకెక్కిన మరాఠీ సినిమా సంచలనాలకు వేదికవుతోంది. ఆకాష్ తోషర్, రింకు రాజ్ గురు జంటగా నటించిన 'సైరాట్' మరాఠీ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాకు దర్శకుడు నాగరాజ్ కాగా, దీనిని కేవలం 4 కోట్ల రూపాయలతో తెరకెక్కించగా, ఇది వంద కోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగులు తీస్తోంది. భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలే వంద కోట్ల మైలు రాయి చేరేందుకు తంటాలు పడుతున్న తరుణంలో వర్ధమాన నటులతో తెరకెక్కిన 'సైరాట్' రికార్డుల దిశగా సాగిపోతోంది. ఊహించని విజయం సాధించడంతో ఈ సినిమాపై వివిధ భాషల నిర్మాతల కళ్లు పడ్డాయి. దీంతో దీనిని రీమేక్ చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. అందులో భాగంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేసే హక్కుల్ని రాక్ లైన్ వెంకటేష్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ రీమేక్ కు కూడా దీనిని మరాఠీలో తీసిన నాగరాజ్ దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. అయితే హీరోహీరోయిన్లను మారుస్తారా? లేదా వారినే కొనసాగిస్తారా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఈ రీమేక్ ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.