: గోవా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు


గోవా క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) అధ్యక్షుడు చేతన్ దేశాయ్ పై బీసీసీఐ సస్పెన్షన్ వేటు వేసింది. 2006-07 మధ్య కాలంలో గోవా క్రికెట్ అసోసియేషన్ కు బీసీసీఐ 3.13 కోట్ల రూపాయల చెక్కును వివిధ పనుల నిమిత్తం పంపింది. దీనిని నకిలీ అకౌంట్ తో సొమ్ము చేసుకుని, జీసీఏ అధ్యక్షుడు చేతన్ దేశాయ్, జీసీఏ కార్యదర్శి వినోద్ ఫడ్కే, ట్రెజరర్ అక్బర్ ముల్లాలు స్వాహా చేసేశారు. దీనిపై విచారణ చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీసీఏ ఛైర్మన్, బీసీసీఐ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ గా ఉన్న చేతన్ దేశాయ్, బీసీసీఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ ప్యానెల్ లో ఉన్న వినోద్ ఫడ్కే ను పదవుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అవినీతి ఆరోపణలపై 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని బీసీసీఐ అధికారులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News