: ఐదుగురు దర్శకులు తీస్తున్న సినిమా క్లైమాక్స్!
క్రికెట్ ప్రధానాంశంగా తెరకెక్కుతున్న తమిళ సినిమా 'చెన్నై 600028' క్లైమాక్స్ ను ఐదుగురు డైరెక్టర్లు చిత్రీకరిస్తున్నారు. 2007లో వచ్చిన ఓ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందిస్తున్నారు. ఈ క్లైమాక్స్ కు దర్శకత్వం వహించనున్న వెంకటేష్ రామకృష్ణన్, శరవణ రాజన్, శ్రీపతి, చంద్రు, నాగేంద్రన్ లు గతంలో వెంకట్ ప్రభు దగ్గర అసిస్టెంట్లుగా పని చేశారు. ఈ సినిమా స్నేహబంధం కథాంశంతో రూపొందుతోందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఈ సినిమాలో జై హీరోగా నటిస్తుండగా, సంగీతం యువన్ శంకర్ రాజా అందిస్తున్నారు.