: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి దగ్గరలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు, మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటనలో తెలిపారు. అదే సమయంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు వ్యాపించి, భారీ వర్షాలు పడతాయని ప్రకటన పేర్కొంది.