: తెలంగాణలో మరో కీలక ప్రాజెక్టు!... ఆదిభట్లలో టాటా బోయింగ్ ఏరో స్పేస్ కు పారీకర్ భూమి పూజ


కొత్త రాష్ట్రం తెలంగాణ పారిశ్రామిక రంగంలో దూసుకుపోతోంది. ఇప్పటికే పలు కంపెనీలు తమ యూనిట్లను తెలంగాణలో ప్రారంభించగా, తాజాగా టాటా బోయింగ్ ఏరో స్పేస్ పేరిట భారత పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ చేపడుతున్న కీలక ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది. ఆదిభట్ల సెజ్ లో కొద్దిసేపటి క్రితం ఈ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారీకర్ భూమి పూజ చేశారు. పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న తెలంగాణకు పలు ప్రతిష్ఠాత్మక సంస్థలు తరలివస్తున్నాయని ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. టాటా బోయింగ్ ఏరో స్పేస్ యూనిట్ లో విమానాలు, హెలికాప్టర్ విడిభాగాలు తయారు కానున్నాయి. తొలి విడతగా ఈ ప్రాజెక్టు కోసం టాటా సన్స్ రూ.200 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News