: మోహన్ బాబు కోడలికి తృటిలో తప్పిన ప్రమాదం!... వెరోనికా కారును ఢీకొన్న మరో కారు!


తెలుగు చలన చిత్రసీమలో విలక్షణ నటుడిగా పేరొందిన మంచు మోహన్ బాబు కోడలు, టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు భార్య వెరోనికా కొద్దిసేపటి క్రితం పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజేంద్ర నగర్ సమీపంలోని లక్ష్మీగూడ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును వేగంగా దూసుకువచ్చిన మరో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వెరోనికాతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఓ ఇంజినీర్ కు స్వల్ప గాయాలయ్యాయి. కారు స్వల్పంగా డ్యామేజ్ అయ్యింది. జల్ పల్లిలోని మోహన్ బాబు ఫాం హౌజ్ కు వెరోనికా ఓ ఇంజినీర్ ను తీసుకువెళుతున్న సందర్భంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News