: 'ఎలిఫెంట్' పదానికి స్పెల్లింగ్ కూడా తెలియని గుజరాత్ మంత్రి!... సోషల్ మీడియాలో సెటైర్లు!


గుజరాత్ సీఎం ఆనంది బెన్ పటేల్ కేబినెట్లో రవాణా శాఖతో పాటు ఆరోగ్య శాఖ బాధ్యతలను భుజాన వేసుకున్న శంకర్ చౌదరి ఎంబీఏ దాకా విద్యనభ్యసించారు. ఈ మేరకు ఎన్నికల సమయంలో దాఖలు చేసే అఫిడవిట్ లో ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి తన విద్యార్హతలను వెల్లడించారు. అయితే ఇటీవల ఆయన తన రాష్ట్రంలోని ఓ పాఠశాలకు వెళ్లారు. మంత్రిగా ఉన్న ఆయన టీచర్ అవతారం ఎత్తారు. పుస్తకం చేతబట్టుకుని పిల్లలకు పాఠాలు చెప్పారు. చేతిలో చాక్ పీసు పట్టి బోర్డుపై ఆంగ్లంలో ఆయా పదాలకు స్పెల్లింగ్ లు కూడా రాశారు. ఈ సందర్భంగా ‘ఏనుగు’ను ఆంగ్లంలో ఏమని పిలుస్తారంటూ ‘ఎలిఫెంట్’ అనే పదాన్ని బోర్డుపై రాశారు. అయితే ఆ పదంలోని ఆరో అక్షరం ‘ఏ’కు బదులు ఆయన ‘ఈ’ అని రాశారు. దీనిని గమనించిన ఓ విద్యార్థి ఎలిఫెంట్ స్పెల్లింగ్ తప్పుగా రాశారని చెప్పి మంత్రిగారికి షాకిచ్చారు. ఈ వ్యవహారం మొత్తం తమ కళ్ల ముందు జరుగుతున్న నేపథ్యంలో మీడియా కూడా పూర్తిగా రికార్డు చేసి ప్రసారం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలోకి ఎక్కేసింది. దీంతో దీనిపై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.

  • Loading...

More Telugu News