: దిగొచ్చిన వీసీ అప్పారావు!... హెచ్ సీయూ ఫ్రొఫెసర్లపై సస్పెన్షన్ ఎత్తివేత!


హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీలో నిన్న మరో కీలక నిర్ణయానికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమధ్య రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో వర్సిటీ ఆందోళనలతో ఉడికిపోయింది. ఈ నేపథ్యంలో బలవంతపు సెలవుపై వెళ్లిన వర్సిటీ వీసీ పొదిలె అప్పారావు... మూడు నెలల తర్వాత ఇటీవలే తిరిగి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ వర్గం విద్యార్థులు వీసీ బంగ్లాపై దాడి చేశారు. ఈ దాడిలో పాల్గొన్న విద్యార్థులకు మద్దతుగా నిలిచారన్న ఆరోపణలతో వర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న కేవై రత్నం, తథాగత్ సేన్ గుప్తాలపై అప్పారావు సస్పెన్షన్ వేటు వేశారు. ఆ తర్వాత నిబంధనల మేరకు ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఆయన ఓ కమిటీని వేశారు. సదరు కమిటీ దీనిపై విచారణ చేసి వీసీకి నివేదిక అందజేసింది. నివేదికలో ఏఏ అంశాలున్నాయన్న విషయం బయటకు రానప్పటికీ... నివేదిక ఆధారంగా నిన్న వారిద్దరిపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News