: ఈ జాబ్ కు నేను తగను!... ఆరు లైన్ల సూసైడ్ నోట్ లో స్పష్టం చేసిన ఏఎస్పీ శశికుమార్


విశాఖ జిల్లా పాడేరు ఏఎస్పీగా పనిచేస్తూ మొన్న అనుమానాస్పద స్థితిలో మరణించిన యువ ఐపీఎస్ అదికారి శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారణ అయ్యింది. ఘటనా స్థలిలో శశికుమార్ రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిన్న అందులోని వివరాలను వెల్లడించారు. ఆంగ్లంలో ఆరు లైన్ల మేర ఉన్న సదరు సూసైడ్ లేఖలోని వివరాల్లోకెళితే... ‘‘నేను ఈ జాబ్ కు సరిపడను. ఇదే విషయంపై మూడు నెలలుగా మధనపడుతున్నా. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. నన్ను క్షమించండి’’ అని ఆ లేఖలో శశికుమార్ రాసుకొచ్చారు.

  • Loading...

More Telugu News