: వీడిన మిస్టరీ...గోవా బీచ్ లో పోలీసులకి చిక్కిన నేవీ అధికారి కూతురు... తండ్రికి అప్పగింత!


శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు మిస్టరీ ఛేదించారు. ఈ నెల 14న విశాఖ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని, పుష్పక్ బస్సు ఎక్కి బోయిన్ పల్లి వరకు వెళ్లిన ఇంటర్ విద్యార్థిని ఖైరవీ శర్మ (17) ఆచూకీని కనిపెట్టేశారు. విశాఖ నుంచి పుణె వెళ్తూ, మార్గ మధ్యంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె, అక్కడి నుంచి పుణెకు విమానం ఎక్కలేదు. ఆమె పూణే చేరుకోలేదన్న వార్తతో తండ్రి ఆమె ఆచూకీ ఆరాతీయగా శంషాబాద్ లో దిగినట్టు తెలిసింది. దీంతో దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టడంతో ఎయిర్ పోర్టు బయట పుష్పక్ బస్సు ఎక్కినట్టు గుర్తించారు. దీంతో ఆమె సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేయగా, బోయినపల్లి వరకూ వెళ్లినట్టు మాత్రమే గుర్తించారు. ఆ తరువాత సెల్ స్విచ్ ఆఫ్ రావడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. దీంతో ఆమె స్నేహితులు, ప్రయాణికులు, ఫేస్ బుక్ స్నేహితులు... ఇలా అందర్నీ విచారిస్తూ పోలీసులు ముందుకి సాగడంతో ఆమె ఎక్కడుందో తెలిసింది. ఖైరవీ శర్మ గోవా బీచ్ లో పోలీసులకి దొరికింది. దీంతో ఆమెను గుర్తించిన పోలీసులు, ఆమె తండ్రి, నేవీ అధికారి అరవింద్ కుమార్ కు అప్పగించారు. దీనిపై ఇతర వివరాలేవీ శంషాబాదు పోలీసులు వెల్లడించకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News