: కేసీఆర్ ను కలిసిన మురళీ మోహన్... మహాకుంభాభిషేకానికి ఆహ్వానం!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సినీ నటుడు, టీడీపీ, రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన మురళీ మోహన్ ఈనెల 18 నుంచి 22 వరకు ఫిలింనగర్ లోని దైవసన్నిధానంలో నిర్వహించనున్న మహాకుంభాభిషేకానికి హాజరుకావాలంటూ కేసీఆర్ ను ఆహ్వానించారు. తప్పకుండా హాజరవుతానని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఆయనకు ఇచ్చారు. ఈ సందర్భంగా వీరు వివిధ అంశాలపై చర్చించారు.