: ఏపీతో పోలిస్తే తెలంగాణ‌కు సగం నిధులు కూడా ఇవ్వ‌లే!: ఎంపీ క‌విత‌


బీజేపీ నేతలు తెలంగాణ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నారని ఎంపీ క‌విత అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు బీజేపీ నేతలు భారీగా నిధులు ఇచ్చామని అంటున్నారని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పోలిస్తే తెలంగాణ‌కు సగం నిధులు కూడా ఇవ్వ‌లేద‌ని అన్నారు. బీజేపీ నేత‌లు తెలంగాణ అంశంలో అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆమె వ్యాఖ్యానించారు. త‌మ ప్ర‌తిప‌క్ష పార్టీ కాంగ్రెస్‌లో నాయ‌క‌త్వ లోపం ఉందని క‌విత విమ‌ర్శించారు. టీఆర్ఎస్ విజ‌న్ ఉన్న పార్టీ అని ఆమె అన్నారు. ‘కాంట్రాక్ట‌ర్ల‌కు టికెట్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పిందని, ఇప్పుడు ఆ విష‌యం ఏమైందని క‌విత ప్ర‌శ్నించారు. నాలుగు నెల‌లుగా వారి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ కోసం ఎదురు చూస్తున్నామ‌ని ఆమె వ్యంగ్యంగా అన్నారు.

  • Loading...

More Telugu News