: వర్షాల కోసం కర్ణాటకలో నగ్న ఊరేగింపులు!


ఓ వైపు తాగేందుకు సైతం నీళ్లులేని కరవు, మరోవైపు రుతుపవనాల ఆలస్యం పీడిస్తుంటే, వర్షాల కోసం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని ఓ గ్రామంలో నగ్న ఊరేగింపులు జరపడం కలకలం రేపింది. ఈ ఘటన పందరహళ్లి గ్రామంలో గతవారం జరుగగా, ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒంటిమీద నూలుపోగు లేని బాలుడికి స్నానం చేయించి, ఆపై ఓ విగ్రహానికి పూజలు జరిపి, ఆ విగ్రహాన్ని బాలుడి చేతిలో పెట్టి, ఊరంతా నడిపిస్తున్న దృశ్యాలున్నాయి. ఇదంతా వరుణుడి కరుణ కోసమేనని గ్రామస్తులు చెబుతుండగా, ఘటన ఈ నెల 10న జరిగిందని విచారిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News