: ఇదో 15 అడుగుల బాహు'బల్లి'... వచ్చి ఇంటి తలుపు తడితే!


భారీ ఆకారంలో ఉండే సరీసృపాలను సినిమాల్లో గ్రాఫిక్స్ రూపంలో ఎన్నోసార్లు చూశాం. అదే ఇక గాడ్జిల్లా సైజున్న ఓ బల్లిని ఎప్పుడైనా చూశారా? అడవుల్లో అత్యంత అరుదుగా కనిపించే ఈ రకం బల్లి ఒకటి జనావాసాల్లోకి వచ్చింది. థాయ్ ల్యాండ్ లో నివసించే అతనాయ్ తయ్యువాన్ వాంగ్ ఇంటికి అతిథిగా వచ్చి తలుపు తట్టింది. ఇంట్లో కలయదిరిగింది. తాళ్లతో పట్టుకుందామని చూస్తే కాసేపు హంగామా చేసింది. దాదాపు 15 అడుగుల పొడవుతో ఉన్న ఈ భారీ బాహు'బల్లి' చిత్రాలు, వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అన్నట్టు ఈ బల్లి ఈ ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటుందని, దీనికి సెలీనా అని పేరు పెట్టుకున్నామని అక్కడి వారు చెబుతున్నారు. దీన్ని బంధించి తిరిగి అడవిలో వదిలిపెట్టినట్టు పేర్కొన్నారు. ఓ భారీ మొసలికన్నా పెద్దగా ఉన్న ఈ బల్లి చిత్రాన్ని మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News