: ఫిరాయింపుదారుల స్థానంలో ఇన్ చార్జీలను మార్చిన జగన్
వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన వారి స్థానంలో కొత్త వారి నియామకాలను చేపడుతున్న అధినేత వైఎస్ జగన్, తాజాగా పలువురికి కొత్త బాధ్యతలు అప్పగించారు. పార్టీ అధికార ప్రతినిధిగా విజయవాడ (సెంట్రల్)కు చెందిన పూనూరు గౌతం రెడ్డిని, అద్దంకి నియోజకవర్గ ఇన్ చార్జిగా బాచిన చెంచు గరటయ్యను, పార్టీ కార్యదర్శిగా అనంతపురం (అర్బన్) నేత బుర్రా సురేష్ గౌడ్ లను నియమిస్తున్నట్టు వైకాపా కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆచంట నియోజకవర్గం బాధ్యతలు నిర్వహిస్తున్న ముదునూరి ప్రసాదరాజుకు అదనంగా నరసాపురం బాధ్యతలను కూడా అప్పగించినట్టు వైకాపా పేర్కొంది. ఎన్నారై డాక్టర్ల విభాగానికి మెల్ బోర్న్ కు చెందిన డాక్టర్ నలిపిరెడ్డి వాసుదేవరెడ్డిని అధ్యక్షుడిగా నియమించినట్టు పేర్కొంది.