: బీజేపీలో ఎవరికీ దక్కని గౌరవం వెంకయ్యనాయుడుకు లభిస్తోంది!: చంద్రబాబు ప్రశంసలు


కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసలు కురిపించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, దక్షిణాదికి చెందిన వ్యక్తి అయి ఉండి, ఉత్తరాది నుంచి రాజ్యసభ సభ్యత్వం సంపాదించిన ఏకైక వ్యక్తి వెంకయ్యనాయుడు అని కితాబునిచ్చారు. వెంకయ్యనాయుడు విలక్షణ వ్యక్తి అని ఆయన అభినందించారు. క్షణం కూడా విరామం లేకుండా పని చేయడం వెంకయ్యనాయుడు బలమని ఆయన అభిప్రాయపడ్డారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా ఆయన సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని ప్రశంసించారు. వెంకయ్యనాయుడుకు బీజేపీలో ఎవరికీ దక్కని గౌరవం లభిస్తోందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News