: ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై గందరగోళం నెలకొంది: అంబటి
ప్రభుత్వం ముద్రగడను ఉగ్రవాదిలా చూస్తోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఈరోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాపుల అంశంపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై గందరగోళం నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి కాపులను మోసం చేస్తే తీవ్రపరిణామాలు తప్పవని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా, డబ్బుకి అమ్ముడుబోయి తమ పార్టీని వీడి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్‌ని విమర్శించే హక్కు లేదని ఆయన అన్నారు.