: దొంగ బాబాపై అలిపిరిలో గతంలో కేసు!
లైఫ్ స్టైల్ యజమాని మధుసూదన్ రెడ్డిని బురిడీ కొట్టించిన శివానందబాబాపై గతంలో తిరుపతిలోని అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైందని పోలీసులు గుర్తించారు. మధుసూదన్ రెడ్డి కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, రెండు మూడు బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చేపట్టారు. అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులను కూడా రంగంలోకి దించారు. రెండేళ్ల క్రితం అలిపిరిలో ఓ కుటుంబంతో పూజలు చేయించే నెపంతో ఇలాగే రెండు లక్షల రూపాయలతో శివానందబాబా ఉడాయించిన కేసు ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో అతను రిమాండ్ ఖైదీగా జైలు శిక్ష కూడా అనుభవించినట్టు పోలీసులు చెబుతున్నారు. దీంతో అలిపిరి పోలీసులను వివరాలు అడిగారు. వారిచ్చిన వివరాలతో ఈ కేసు ఛేదించవచ్చని హైదరాబాదు పోలీసులు భావిస్తున్నారు.