: అనంత కౌన్సిల్ లో వాగ్వాదానికి దిగిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి


ఈ ఉదయం అనంతపురం కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరుగగా, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిల మధ్య రామ్ నగర్ ఆర్ఓబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జ్)పై తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభమైనప్పటికీ, పనులను కావాలనే ఎమ్మెల్యే జాప్యం చేయిస్తున్నారని దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో వీరిద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులను కేటాయిస్తున్నప్పటికీ, ఆక్రమణల తొలగింపు ఆలస్యం అవుతుండటం వెనుక ప్రభాకర్ హస్తముందని జేసీ ఆరోపించారు. కోర్టు కేసులు స్వయంగా వేయిస్తూ, పనులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాగా, బ్రిడ్జ్ నిర్మాణం నిమిత్తం మునిసిపల్ దుకాణాలున్న భవంతిని తొలగించాల్సి వుండగా, దుకాణదారులు కోర్టును ఆశ్రయించడంతో పనులు ఆగిపోయాయి.

  • Loading...

More Telugu News