: యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా రాహుల్ కాదు, ప్రియాంకా కాదు... షీలా దీక్షిత్ అట!


ఉత్తరప్రదేశ్ లో ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలా దీక్షిత్ ను ఎంచుకున్నట్టు పార్టీ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. యూపీ కాంగ్రెస నేతలు, కార్యకర్తలు ప్రియాంకా గాంధీ, లేదా రాహుల్ గాంధీని సీఎం అభ్యర్థిగా పెట్టాలని డిమాండ్ చేస్తున్న వేళ, అధినేత్రి సోనియా, షీలా దీక్షిత్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సమాచారం అందుకున్న ఆమె, నేడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసి చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, గత ఆదివారం నాడు యూపీ పార్టీ ఇన్ చార్జ్ గా ఉన్న మధుసూదన్ మిస్త్రీని తొలగించి గులాం నబీ ఆజాద్ కు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News