: 'జోగులాంబ' కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్న డీకే అరుణ!
గత కొంత కాలంగా గద్వాల కేంద్రంగా ప్రత్యేక జిల్లాను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ మహిళా నేత, మాజీ మంత్రి డీకే అరుణ, తన డిమాండ్ ను నెరవేర్చుకునేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇటీవలి జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమావేశంలో గద్వాల పేరు వినిపించకపోవడంతో ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. యాదాద్రి, భద్రాద్రి జిల్లాలతో పాటు అలంపురంలో శక్తి పీఠంగా పూజలందుకుంటున్న జోగులాంబ పేరిట గద్వాల కేంద్రంగా 'జోగులాంబ' జిల్లాను ఏర్పాటు చేయాలన్నది ఆమె ప్రధాన డిమాండ్. గద్వాల, లేదా హైదరాబాద్ లో ఆమె దీక్షకు దిగుతారని, ఆమె భర్త భరతసింహారెడ్డి స్వయంగా ఏర్పాట్లు చేస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.