: ఫసల్ బీమా పథకంలో టీఆర్ఎస్ ప్రభుత్వం భాగస్వామ్యం కావాలి: దత్తాత్రేయ సూచన
నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మోదీ పథకాలను పేదలు హర్షిస్తున్నారని అన్నారు. ఫసల్ బీమా పథకంతో కరవు ప్రాంతాల రైతులకు ప్రయోజనం కలుగుతోందని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫసల్ బీమా పథకంలో భాగస్వామ్యం కావాలని దత్తాత్రేయ సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. 14వ ఆర్థిక సంఘంతో రాష్ట్రానికి లక్ష కోట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.