: రణతంబోర్ అడవుల్లో ముద్దులొలికే పులికూనలు... అధికారుల సంబరాలు


వన్యప్రాణుల ప్రేమికులకు అత్యంత శుభకరమైన వార్త ఇది. రాజస్థాన్ లోని రణతంబోర్ టైగర్ రిజర్వ్ లో పర్యటనకు వెళ్లిన కొందరికి రెండు పులికూనలు కనిపించాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు సంబరాలు జరిపారు. ఓ ఆడపులి వీటిని కనివుంటుందని, మరిన్ని కూనలు ఉండవచ్చని తెలిపారు. ప్రస్తుతం రణతంబోర్ లో 25 మగ, 18 ఆడ పెద్దపులులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెద్దపులుల సంఖ్య తగ్గుతున్న వేళ, ఇండియాలో వాటి సంఖ్య నెమ్మదిగా పెరుగుతుండటం పట్ల అధికారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. డీ-73 అనే పేరున్న ఆడ పులి వీటిని కనివుండవచ్చని, అభయారణ్యంలో మరిన్ని ఆడపులులు పిల్లల్ని కనివుండవచ్చని వాటిని గుర్తిస్తామని తెలిపారు. కాగా, వీటిని తొలిసారిగా చూసిన పర్యాటకులు తామెంతో అదృష్టవంతులమని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News