: గుత్తా సుఖేందర్, కేసీఆర్‌లపై దిగ్విజయ్ ఫైర్
తెలంగాణలో పర్యటిస్తోన్న కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ప్రస్తుతం ఆదిలాబాద్‌లో ఉన్నారు. నిన్న రాత్రి ఆదిలాబాద్ చేరుకున్న ఆయనకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి జంప్ అయిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిపై మండిపడ్డారు. గుత్తా పార్లమెంట్ సభ్యత్వం రద్దు అయ్యేలా తాము పోరాటం జరుపుతామని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. కేసీఆర్ తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలన చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ పాలన, తెలంగాణలో కేసీఆర్ పాలన ఒకేలా ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రి వర్గంలో మాల, మాదిగలకు చోటు లభించలేదని ఆయన అన్నారు. కేసీఆర్ తన మంత్రి వర్గంలో మహిళలను కూడా చేర్చుకోలేదని ఆయన విమర్శించారు.