: నాపై సామూహిక అత్యాచారం: పోలీసులకు నటి పూజామిశ్రా ఫిర్యాదు
గతంలో ఎన్నోమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి, బిగ్ బాస్-5 పోటీదారు పూజా మిశ్రా, తాను ముగ్గురు యువకుల చేత గ్యాంగ్ రేప్ నకు గురయ్యానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'అభీతో పార్టీ షురూ హువా హై' పేరిట ఓ కార్యక్రమంలో తాను జైపూర్ లో ఓ కార్యక్రమంలో నృత్యం చేయాల్సి వుందని, తన నాట్యాన్ని వీడియో తీసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని నియమించుకోగా, వారు తనకు మత్తు మందిచ్చి అత్యాచారం చేశారని ఆమె పోలీసులకు తెలిపినట్టు సమాచారం. కాగా, ఆమె ఫిర్యాదును రిజిస్టర్ చేసిన పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ మొత్తం ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.