: హైదరాబాద్లో లేడీస్ హాస్టల్లో యువతికి మత్తుమందిచ్చి అత్యాచారయత్నం
హైదరాబాద్ ఎస్సార్ నగర్ బీకేగూడలోని ఓ ప్రైవేటు లేడీస్ హాస్టల్లో బసచేస్తోన్న ఓ యువతిపై అత్యాచారయత్నం జరిగింది. లేడీస్ హాస్టల్ని నిర్వహిస్తోన్న రవీందర్ అనే వ్యక్తి ఈ దారుణానికి యత్నించాడు. యువతికి మత్తుమందు ఇచ్చిన రవీందర్ ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. కామాంధుడి బారినుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదుతో లేడీస్ హాస్టల్ని నిర్వహిస్తోన్న రవీందర్ ను అదుపులోకి తీసుకొని కేసుని దర్యాప్తు చేస్తున్నారు.