: 6.44 అంగుళాల మాసివ్ డిస్ ప్లేతో జియోమీ కొత్త ఫోన్
గత నెలలో చైనాలో విడుదలై సంచలనం సృష్టించిన జియోమీ మీ మ్యాక్స్ ఈ నెలాఖరులో ఇండియాలో విడుదల కానుంది. 6.44 అంగుళాల అతిపెద్ద డిస్ ప్లేతో పాటు అత్యాధునిక ఫీచర్లున్న ఈ ఫోన్ ను 30న భారత మార్కెట్లో అందుబాటులో ఉంచనున్నట్టు సంస్థ తెలిపింది. మూడు వేరియంట్లలో లభించే ఈ ఫోన్ ధరలు రూ. 15 వేలు (3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్), రూ. 17 వేలు (3 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్), రూ. 20,500 (4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్)గా ఉంటాయని తెలుస్తోంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పాటు 16/5 ఎంపీ కెమెరాలు, 4జీ సదుపాయాలుండే ఫోన్ గోల్డ్, సిల్వర్, డార్క్ గ్రే కలర్ లలో లభించనుంది.