: గుత్తాతో మైత్రిని నెమరువేసుకున్న కేసీఆర్!


నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి నిన్న టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాదులోని టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో భాగంగా గుత్తాను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్... ఆయనతో తనకున్న మైత్రిని నెమరువేసుకున్నారు. గుత్తా తనకు ఆప్త మిత్రుడని పేర్కొన్న కేసీఆర్... 1996 ఎన్నికల సందర్భంగా వారిద్దరూ కలిసిన జ్ఞాపకాలను ప్రస్తావించారు. నాటి ఎన్నికల్లో భాగంగా శ్రీరాంసాగార్ కట్ట మీద తామిద్దరం కూర్చుని చర్చించుకున్న విషయాలను కూడా కేసీఆర్ నెమరువేసుకున్నారు. ఆంధ్రాకు నీరిస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు వైష్ణవాలయం మాదిరిగా ఉండగా... ఎస్ఆర్ఎస్పీ మాత్రం శివాలయంగా ఉందని నాడు తామిద్దరం మాట్లాడుకున్నామని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News